Mr. Rahul Narain Bhagat

Nasser Munjee

రాహుల్ భగత్

​​​​​​​ఇండిపెండెంట్ డైరెక్టర్​​​

శ్రీ రాహుల్  భగత్ గారు 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కన్స్యూమర్ బ్యాంకింగ్ ప్రొఫెషనల్. శ్రీ భగత్ గారు తన కెరీర్ ని ఏ ఎన్ జెడ్ గ్రిండ్‌లేస్ బ్యాంక్ (1989-1997) లో ప్రారంభించారు. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వైస్ ప్రెసిడెంట్‌గా (1997-1999) పనిచేశారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా తన ఆసియా మార్కెట్లలోని కన్స్యూమర్ బ్యాంకింగ్ పోర్ట్‌ఫోలియోలను విక్రయించినప్పుడు, ఆయన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో చేరి, అక్కడ తదుపరి 16 సంవత్సరాలు (1999-2015) గడిపారు. రిటైల్ లయబిలిటీస్, మార్కెటింగ్ మరియు డైరెక్ట్ బ్యాంకింగ్ ఛానల్స్ కంట్రీ హెడ్‌గా, ఆయన 10 సంవత్సరాల పాటు సిఈఓ కి రిపోర్ట్ చేస్తూ, బ్యాంకును అగ్రశ్రేణి కన్స్యూమర్ మరియు డిజిటల్ బ్యాంకింగ్ ఫ్రాంచైజీగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం, 2015లో పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ కోసం వొడాఫోన్ ఇండియా లిమిటెడ్‌తో జతకట్టి, ప్రతిపాదిత బ్యాంకుకు సిఈఓ (డిసిగ్నేట్) గా నియమితులయ్యారు.

ఆయన సుదీర్ఘ బ్యాంకింగ్ కెరీర్ లో, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఏ) రిటైల్ బ్యాంకింగ్ స్టాండింగ్ కమిటీ, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ ఎస్ డి ఎల్) ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఎన్ సి ఆర్ కార్పొరేషన్ (యుఎస్ఏ) మరియు డైబోల్డ్ ఇంక్ (యుఎస్ఏ) వంటి అనేక బోర్డులు మరియు కమిటీలలో సభ్యుడిగా వ్యవహరించారు. ఆయన విద్యా మరియు వారసత్వ సంరక్షణ రంగాలలో చురుకుగా పాలుపంచుకుంటున్నారు. ఆయన ది డూన్ స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా మరియు వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ ఇండియా అసోసియేషన్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఉన్నారు. శ్రీ రాహుల్ భగత్ గారిని 'ది ఏషియన్ బ్యాంకర్' తమ ప్రముఖ నిపుణుల జాబితాలో గుర్తించింది. ఆయన కాలేజ్ ఆఫ్ విలియం అండ్ మేరీ (యుఎస్ఏ) నుండి ఇంటర్నేషనల్ అఫైర్స్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ మరియు ఢిల్లీ యూనివర్శిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి హిస్టరీ (ఆనర్స్) లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు.  

వెనక్కి వెళ్ళండి