అమన్ కిర్లోస్కర్
అడిషనల్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
శ్రీ అమన్ కిర్లోస్కర్ గారు మే 2018 లో కిర్లోస్కర్ చిల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సప్లై చైన్ మేనేజర్ గా కిర్లోస్కర్ గ్రూప్లో తన కెరీర్‌ను ప్రారంభించారు. తరువాత ఆగస్టు 2019 లో ఆయన కిర్లోస్కర్ ప్న్యూమాటిక్ కంపెనీ లిమిటెడ్ లో సీనియర్ మేనేజర్ గా చేరారు.
2020లో ఆయనను జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) గా పదోన్నతి పొందారు . అప్పటి నుండి ఆయన మాన్యుఫాక్చరింగ్, సప్లై చైన్, ఫౌండ్రీ, ప్లాంట్ ఇంజినీరింగ్ మరియు క్వాలిటీ ఆఫ్ ఎయిర్ కంప్రెసర్ మరియు ట్రాన్స్‌మిషన్ డివిజన్స్ నిర్వహణలో చురుకుగా పాల్గొంటున్నారు.
కోవిడ్ రెండవ దశ సమయంలో దేశానికి ఆక్సిజన్ మరియు దాన్ని ఉత్పత్తి చేసే యంత్రాల అత్యవసరo ఉన్నప్పుడు స్క్రూ కంప్రెసర్స్ ఉత్పత్తిని పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
అటు తరువాత 2023లో ఆయన ఎయిర్ కండిషనింగ్ మరియు రిఫ్రిజరేషన్ బిజినెస్ యూనిట్‌కు నాయకత్వం వహించారు. ఈ పాత్రలో ఆయన కొత్త ఉత్పత్తులను ప్రారంభించి వాటి విక్రయాలను పెంచడంలో మరియు డివిజన్ యొక్క మొత్తం సేల్స్ మరియు లాభాలను గణనీయంగా పెంచడంలో సహాయపడ్డారు.
అతను గ్రూప్ లెవల్ కార్యక్రమాలకు కూడా నాయకత్వం వహిస్తున్నారు, ముఖ్యంగా ESG కంప్లయన్స్ రంగంలో. ఆయన గ్రూప్ లెవల్ ఎన్విరాన్‌మెంట్ కన్సర్వేషన్ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు, ఇది వివిధ బిజినెస్ యూనిట్లలో సస్టైనబిలిటీ, గ్రీన్ టెక్నాలజీ మరియు సర్క్యులర్ ఎకానమీపై దృష్టి పెట్టిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు.
వెనక్కి వెళ్ళండి